గూర్ఖాలాండ్ ఉద్యమాల గురించి కేసీఆర్ ఏమన్నారంటే

తెలంగాణా రాష్ట్రసాధన కోసం సుమారు 14ఏళ్ళు ఏకధాటిగా పోరాటాలు చేసి చివరకు తన ఆశయం సాధించుకొన్న కేసీఆర్ ను ప్రస్తుతం ఉదృతంగా సాగుతున్న ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమాలపై మీ అభిప్రాయం ఏమిటని ఒక విలేఖరి ప్రశ్నించినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి సమాధానం చెప్పారు. “గూర్ఖాలాండ్ ఉద్యమాలను తెలంగాణాతో పోల్చలేము. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చాలా కాలంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఆ వ్యవహారం చాలా సంక్లిష్టమైనది. దానిలో పొరుగుదేశాలతో ముడిపడున్న సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడు చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఈ సమస్యలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. కనుక ఇది చాలా సున్నితమైన సమస్య. గూర్కాలాండ్ ఉద్యమాల గురించి ప్రస్తుతం ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడటం సరికాదు. ఒకవేళ దానిపై మా వైఖరి తెలియజెప్పాలంటే ముందుగా నేను మా పార్టీ సభ్యులతో చర్చించుకొన్నకనే చెప్పగలను,” అని అన్నారు.