వచ్చే నెలలో కొత్త సచివాలయానికి శంఖుస్థాపన

రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ లోని బైసన్ పోలో మైదానాన్ని అప్పజేప్పెందుకు రక్షణశాఖ అంగీకరించడంతో వచ్చే నెల దసరా పండుగ రోజున అక్కడ కొత్త సచివాలయ భవనానికి శంఖుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బైసన్ పోలో మైదానంలో 40 ఎకరాలు, జింఖానాలో 24 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి ఉన్నందున అక్కడ సువిశాలమైన, అత్యాధునిక సదుపాయాలు కలిగిన సచివాలయం నిర్మించడానికి రోడ్లు భవనాల శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాదిలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.