పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పనామా పేపర్స్ కుంభకోణంలో దోషిగా పాక్ సుప్రీంకోర్టు చేత నిర్దారింపబడటంతో తన పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్రమంత్రిగా చేస్తున్న అధికార పాకిస్తాన్ పీఉల్స్ పార్టీకే చెందిన షాహిద్ ఖాన్ అబ్బాసి ప్రధానిగా ఎంపికయ్యారు. దీని కోసం పాక్ పార్లమెంటు ఓటింగ్ నిర్వహించగా 342స్థానాలున్న పార్లమెంటులో ఆయనకు 221 ఓట్లు రావడంతో ఆయన ప్రధానిగా ఎంపికయ్యారు. సాక్షాత్ దేశప్రధాని అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు చేత అభిశంసింపబడి పదవిలో తప్పుకోవడం ఒక వింత అనుకొంటే, సాధారణంగా ఇటువంటి సందర్భాలలో అధికారం చేజిక్కించుకొనే అలవాటున్న పాక్ సైన్యం ఈసారి జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం మరో విచిత్రం అని చెప్పవచ్చు. కనుక ఈసారి పాక్ ప్రజలు. పాలకులు, ప్రజా ప్రతినిధులు అందరూ అదృష్టవంతుల క్రిందే లెక్క. ప్రభుత్వంపై సైన్యం పెత్తనం చేస్తే నిధులు విదిలించామనే అమెరికా హెచ్చరికల కారణంగా పాక్ సైన్యం దూరంగా ఉండాల్సి వచ్చిందేమో?