
మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దిగినందున ఇక పార్టీ స్థాయి రాజకీయాలకు, ఇతర పార్టీలకు దూరంగా ఉండక తప్పదు. ఈ పదవి పొందిన తరువాత ఇక ఆయన ఇప్పటిలాగ ఏపి సిఎం చంద్రబాబు నాయుడిని లేదా ప్రధాని నరేంద్ర మోడీ నోరారా పొగడలేరు. మంచి వాగ్ధాటి కలిగిన నేతగా పేరున్న ఆయన నోటిని ఇకపై కుట్టేసుకోక తప్పదు. ఈ పదవితో అయన రాజకీయ జీవితం పరిసమాప్తం అయినట్లే చెప్పవచ్చు. తనను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన తరువాత ఆయనే స్వయంగా పార్టీకి దూరం అవుతున్నందుకు చాలా ఆవేదన చెందారు.
ఇదే విషయాన్ని మీడియా, ప్రతిపక్షాలు మరోవిధంగా చెపుతున్నాయి. ఆయనను రాజకీయాలలో నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పించారని చెపుతున్నాయి.మళ్ళీ రాజకీయాలలోకి రావడం కుదరదు ఇదే విషయాన్ని మీడియా, ప్రతిపక్షాలు మరోవిధంగా చెపుతున్నాయి. ఆయనను రాజకీయాలలో నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పించారని చెపుతున్నాయి.
ఒకవేళ వచ్చే ఎన్నికలలో మళ్ళీ భాజపా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆయన అదృష్టం బాగుంటే రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందవచ్చు. తప్ప మళ్ళీ రాజకీయాలలోకి రావడం కుదరదు. ఆయన రాజకీయాల నుంచి వైదలగుతున్నందున శనివారం విజయవాడలో తెదేపా, భాజపా నేతలు ఆత్మీయ సన్మానం పేరిట వీడ్కోలు సభ నిర్వహించారు.
ఆ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, “నన్ను రాజకీయాల నుంచి తప్పించారని చెప్పడం సరికాదు. నేను అకుంటిత దీక్షతో పనిచేస్తూ అటు మా పార్టీలో, మా ప్రభుత్వంలో అంచలంచెలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకొన్నాను. కనుక నా ఎదుగుదలకు వక్ర బాష్యం చెప్పడం సరికాదు,” అని అన్నారు.
తరువాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గొప్పదనం, జి.ఎస్.టి., నోట్లరద్దు వంటి అనేక అంశాల గురించి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఆగస్ట్ 5వ తేదీన ఎన్నికలు జరిగే వరకు వెంకయ్య నాయుడు తనివితీరా మాట్లాడుకోవచ్చు. కానీ అదేరోజున ఫలితాలు వెలువడి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత ఇక తన నోరు కుట్టేసుకోక తప్పదు. చేపను నీటిలో ఈదొద్దని..పక్షిని గాలిలో స్వేచ్చగా ఎగురొద్దని చెపితే అవి ఎంత బాధపడతాయో వెంకయ్య నాయుడును మాట్లాడొదంటే అంతే బాధపదుతున్నారేమో పాపం. ఆయాచితంగా అంత గొప్ప పదవి దక్కినందుకు సంతోషించాలో లేక దాని కోసం తన వాక్ స్వాతంత్ర్యం కోల్పోతునందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఆయనది.