రోడ్డు ప్రమాదంలో తెరాస నేత మృతి

తెరాసలో ఈరోజు మరో విషాదం చోటు చేసుకొంది. ఆ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దుబ్బాక నరసింహా రెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన స్వంత పని మీద కారులో విశాఖపట్నం వచ్చిన ఆయన అది ముగించుకొని చిట్యాలకు తిరిగి వెళుతుండగా నార్కెట్ పల్లి బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని డ్డీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానికుల ద్వారా ఈ సంగతి తెలుసుకొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్థానిక పోలీసులకు, వైద్య సిబ్బందికి వెంటనే ఈ సమాచారం అందించి తను కూడా అక్కడికి చేరుకొన్నారు. కానీ అప్పటికే సతీష్ రెడ్డి మృతి చెందారు. సతీష్ రెడ్డి భార్య మమత ఎంపీటీసీగా పని చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే వరంగల్ 44వ వార్డు తెరాస కార్పొరేటర్ అనిశెట్టి మురళి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అది జరిగి రెండువారాలు కాకముందే ఈ దుర్ఘటన జరిగింది.