
డ్రగ్స్ కేసులో నోటీస్ అందుకొన్న సినీ నటి ఛార్మీ బుధవారం సిట్ విచారణకు హాజరైంది. విచారణలో ఏమి ప్రశ్నించారనే దానిపై ఆమె కానీ, ఎక్సైజ్ అధికారులు గానీ బయటపెట్టలేదు కనుక దాని గురించి మీడియాలో వస్తున్న గాలి వార్తలను పట్టించుకొనవసరం లేదు. అయితే ఆమె తన రక్తం, గోళ్ళు, జుత్తు వెంట్రుకలు ఇవ్వడానికి నిరాకరించారని అధికారులు చెప్పారు కనుక అదొక్కటే నిజమని చెప్పవచ్చు. రేపు మరోనటి ముమ్మైత్ ఖాన్ విచారణకు హాజరు కావలసి ఉంది. అందుకు ఆమె అంగీకరించింది కూడా. కనుక ప్రస్తుతం పూణేలో జరుగుతున్న తెలుగు బిగ్ బాస్ షో నుంచి ఆమె బయటకు వచ్చి రేపు ఉదయం 10గంటలలోగా ఆమె విచారణకు కావలసి ఉంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న ఆమె ఎప్పుడూ ఈ సిట్ విచారణ గురించి ఏమాత్రం దిగులుపడుతున్నట్లు కనబడకపోవడం విశేషం.