
సంచలనం సృష్టించిన బ్యూటిషియన్ శిరీష్, ఎస్.ఐ.ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల కేసుపై దర్యాప్తు జరిపిన అదనపు డిజి గోపీకృష్ణ శనివారం తన నివేదికను డిజిపి అనురాగ్ శర్మకు సమర్పించారు. గత నెల 12వ తేదీన రాత్రి తన వద్దకు వచ్చిన శిరీష తిరిగి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆత్మహత్య చేసుకొందనే విషయం తెలుసుకొన్న కుకునూరుపల్లి ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి, ఆ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకొంటుందో అనే భయంతోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబందించని మరో కొత్త విషయం కూడా నివేదికలో బయటపడింది. ఎసిపి గిరిధర్ ఎస్.ఐ.ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేవారని ఆ కారణంగా కూడా ప్రభాకర్ రెడ్డి కొంత ఒత్తిడికి లోనయినట్లు నివేదికలో పేర్కొన్నారు.