
రాష్ట్రపతి ఎన్నికలలో అందరూ ఊహించిందే జరిగింది. ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఆయనకు సుమారు 6.5 లక్షల విలువగల ఓట్లు సాధిస్తారని అంచనా వేస్తే అంతకంటే ఎక్కువగా 7,02,044 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలుగా పోటీ చేసిన మీరా కుమార్ కు 3,67, 314 విలువ గల ఓట్లు వచ్చాయి. అంటే మీరా కుమార్ పై 3,34,730 విలువ గల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అది ఇంచుమించు ఆమె సాధించిన ఓట్లు విలువకు సమానంగా ఉండటం విశేషం.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24 తో ముగుస్తుంది కనుక రాంనాథ్ కోవింద్ ఈనెల 25న భారతదేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇంతకాలం భాజపా, ఆర్.ఎస్.ఎస్.లకు చెందిననవాడిగా ముద్రపడిన కోవిందుడు రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఇక అందరివాడయ్యారు.