రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే ప్రకటింపబడతాయి. రాష్ట్రపతి ఎన్నికలలో సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరిగినప్పటికీ వాటి ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అందరికీ ముందే ఖచ్చితంగా తెలియడమే ఈ ఎన్నికల ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈరోజు ఓట్లు లెక్కించి మద్యాహ్నంకల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రాంనాథ్ కోవింద్ కు సుమారు 6 లక్షలకు పైగా ఎలక్ట్రాల్ కాలేజీ ఓట్లు ఉన్నందున ఆయన విజయం సాధించడం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈనెల 24 న ముగుస్తుంది కనుక 25న రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు. 

రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తరువాత ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్ట్ 5న ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కూడా ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వెంకయ్య నాయుడు విజయం సాధించడం తధ్యమేనని చెప్పవచ్చు. ఎన్డీయే అభ్యర్ధుల చేతిలో తమ అభ్యర్ధులు ఓడిపోతారని ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మీరా కుమార్, గోపాలకృష్ణ గాంధిని బరిలోకి దించి ఆడిన రాజకీయ చదరంగంలో వారివురు పావులుగా మిగిలిపోనున్నారు.