డాక్టర్ శ్రీకాంత్ కిడ్నాప్ కధ అలా ముగిసింది

తెలంగాణా రాష్ట్రానికి చెందిన డాక్టర్ శ్రీకాంత్ కిడ్నాప్ కధ అనేక ట్విస్టులు తరువాత చివరికి సుఖాంతం అయింది. డిల్లీ మెట్రో ఆసుపత్రిలో పిజి చేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ ను జూలై 6వ తేదీన యూపికి చెందిన ప్రమోద్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. అప్పటి నుంచి డిల్లీ, యూపి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కానీ అతను శ్రీకాంత్ ను వేర్వేరు స్థావరాలకు మార్చుతుండటం పోలీసులకు అతని ఆచూకి కనిపెట్టడం చాలా కష్టమయింది. అయితే అతను అడిగిన విధంగా రూ.5 కోట్లు ఇస్తామని మభ్యపెట్టి అతని స్థావరాన్ని కనుగొని పోలీసులు వల పన్ని కిడ్నాపర్ ను పట్టుకొని అతని చెర నుంచి శ్రీకాంత్ ను క్షేమంగా విడిపించారు. ఆ విషయం అయన తల్లితండ్రులకు తెలియజేశారు. కిడ్నాపర్ కు మరో ముగ్గురు స్నేహితులు సహాయపడినట్లు తెలుసుకొని వారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాంత్ డిల్లీ చేరుకొన్నారు. త్వరలో మళ్ళీ విధులలో చేరే అవకాశం ఉంది.