
కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి గోపాలకృష్ణ గాంధి నిన్న నామినేషన్ వేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చారు. మహాత్మాగాంధీ, డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా అతని ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ ఉండదని వారు అభిప్రాయపడేవారు. మరణశిక్షలు విధించడం మధ్యయుగాల నాటి విధానం. అది నేటికీ అమలుచేయడం సరికాదని నా అభిప్రాయం. అందుకే యాకుబ్ మీమన్ ఒక ఉగ్రవాది అని తెలిసి ఉన్నప్పటికీ అతనికి ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకించాను. అతనికే కాదు...కులభూషణ్ జాదవ్ కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రస్తుతం మన సమాజంలో ప్రతీ అంశంపై భినాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కనుక నా విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వెలువడటం సహజమే. నేను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే దేశసమగ్రతను కాపాడటానికి కృషి చేస్తాను,” అని అన్నారు.