తిలక్ పరువు తీసిన మునిమనుమడు

బాలగంగాధర్ తిలక్..దేశప్రజలకు పరిచయం అవసరం లేని మహానుభావుడు. ఆ కారణంగా ఆయన వంశానికి చెందినవారిపై కూడా ప్రజలు గౌరవం చూపడం సహజం. కానీ ఆ మహానుభావుడి పేరుకి అప్రదిష్ట కలిగించే పనిచేశాడు ఆయన మునిమనుమడు రోహిత్. 

బాలగంగాధర్ తిలక్ మునిమనుమడు..దివంగత ఎంపి జయంత్ రావుకు మనుమడు అయిన రోహిత్ మహారాష్ట్రలో పూణేలోని కస్బాపేట్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. అతనికి తన కంటే వయసులో పెద్దదైన ఒక మహిళతో అక్రమసంబంధం ఉంది. ఆమెను పెళ్ళి చేసుకొంటానని నమ్మిస్తూ ఆమెతో తన లైంగికవాంఛలు తీర్చుకొంటున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆమెను అసహజ పద్దతులలో లైంగిక వాంఛలు తీర్చమని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు రోహిత్ పై అత్యాచారం కేసును నమోదు చేశారు.