
సహేతుకమైన కారణాలు చూపిన వారికి తమ వద్ద మిగిలిపోయున్న పాత నోట్లను మార్చుకోవడానికి మరొక్క అవకాశం కల్పించాలనే సుప్రీంకోర్టు సూచనపై కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా స్పందించింది. పాత నోట్ల రద్దు తరువాత వాటిని మార్చుకోవడానికి ఇచ్చిన గడువులో ఇచ్చిన అనేక అవకాశాలు దుర్వినియోగం అయ్యాయని కనుక మళ్ళీ మరో అవకాశం ఇవ్వడం వలన ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నల్లకుభేరులు దానిని కూడా దుర్వినియోగపరచవచ్చని కనుక రద్దైన పాత నోట్లను మార్పిడికి అంగీకరించలేమని కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఆవిధంగా చేస్తే నోట్లరద్దు ద్వారా ఆశించిన ప్రయోజనం (నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అరికట్టడం) దక్కదని తెలిపింది. ఇక ఎట్టిపరిస్థితులలో రద్దైన పాత నోట్లను మార్పిడికి అంగీకరించలేమని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నవారందరికీ ఇది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.