నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేడు పార్లమెంటులో మరియు అన్ని రాష్ట్రాల శాసనసభలలో ఒకపక్క జోరుగా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంటే మరోపక్క నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా మొదలవడంతో దేశంలో రాజకీయ పార్టీలన్నీ చాలా హడావుడిగా ఉన్నాయి. నేటి నుంచి ఆగస్ట్ 11 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. 

ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలలో మోడీ సర్కార్ పై సందించడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాల వద్ద అనేక ఆయుధాలు సిద్దంగా ఉన్నాయి. పశువద నిషేధం, గోరక్షక్ పేరిట మైనార్టీల జరుగుతున్న దాడులు, సిక్కిం సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం, కాశ్మీర్ లో అల్లర్లు, అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడులు, జి.ఎస్.టి.పై అభ్యంతరాలు, రాష్ట్రపతి ఎన్నికలలో దళిత అభ్యర్ధుల మద్య పోటీ వంటి అనేక అంశాలపై ప్రతిపక్షాలు మోడీ సర్కార్ పై దాడి చేయవచ్చు.     

రెండు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. తెలంగాణాలో  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. తెలంగాణా అప్పుడే ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఆంధ్రాలో ఏకైక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకొంటున్నారు.