మహబూబాబాద్ తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో అయనకు తన పరిస్థితి ఏమిటో పాలుపోవడంలేదు. ఆయన శనివారం సచివాలయానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి తన గోడు మోర పెట్టుకొన్నారు. బహుశః ఆయన ద్వారా ముఖ్యమంత్రికి తన వివరణ తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈరోజు ఆయనతో బాటు జనగాం తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా సచివాలయానికి వచ్చి కడియం శ్రీహరిని కలిసి ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ను కలిసారు. ఆయన కూడా జిల్లా అధికారులపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పిర్యాదు చేసారు. వారిరువురిపై పార్టీ తరపున కానీ, ప్రభుత్వం తరపున గానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనప్పటికీ వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.