
వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 44వ వార్డు తెరాస కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో నగరానికే చెందిన ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లను పోలీసులు ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చడం కలకలం సృష్టిస్తోంది. మురళిని హత్య చేసిన దుండగులు ముగ్గురూ స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిలొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (ఏ-4), పోతుల శ్రీనివాస్ (ఏ-5), కానుగంటి శేఖర్ (ఏ-6) లుగా ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. వారు ముగ్గురికీ మురళి హత్యతో సంబంధం ఉందనే ప్రాధమిక సాక్ష్యాలు లభించినందునే వారి పేర్లను ఎఫ్.ఐ.ఆర్.లో చేచేర్చామని పోలీసులు చెపుతుంటే, తమపై రాజకీయ కక్ష సాధింపు కోసమే అన్యాయంగా తమ పేర్లను ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారని వారు వాదిస్తున్నారు. ఈ హత్యతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని, మురళి హత్య పట్ల తాము కూడా చాలా బాధపడ్దామని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఊహించని ఈ పరిణామంపై స్పందించలేదు.