వచ్చే ఏడాది నుంచి హరితహారం అవార్డులు

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో 3వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభవోత్సవం సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో మొక్కల పెంపకం, సంరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు, సంస్థలకు వచ్చే ఏడాది నుంచి హరితహారం అవార్డులు పేరిట నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించారు.  

ప్రతి జిల్లాలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, ఉత్తమ మండలానికి రూ.8 లక్షలు, పట్టణంలో ఉత్తమ వార్డుకు రూ. 5 లక్షలు, ఉత్తమ ప్రాథమిక పాఠశాలకు రూ. 2 లక్షలు, ఉత్తమ ఉన్నత పాఠశాలకు రూ. 2 లక్షలు, ఉత్తమ జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలకు రూ. 2 లక్షల చొప్పున నగదు బహుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సర్పంచ్, కార్పొరేటర్ మొదలు మంత్రి వరకు ఎవరికైనా ఉత్తమ ప్రజాప్రతినిధికి రూ. 1 లక్ష, ఉత్తమ అటవీ అధికారికి రూ. 1 లక్ష, ఉత్తమ గ్రామీణాభివృద్ధి అధికారికి రూ. 1 లక్ష నగదు బహుమతులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.