సిఎం కేసీఆర్ కరీంనగర్ టూర్ షెడ్యూల్

ఈరోజు నుంచి తెలంగాణా రాష్ట్రంలో 3వ విడత హరితహారం (మొక్కలు నాటే కార్యక్రమం) మొదలుకాబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ లో లోయర్ మానేరు డ్యాం వద్ద మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆయన టూర్ షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది. 

ఉదయం 9.30గంటలకు ఎర్రవెల్లిలో తన వ్యవసాయ క్షేత్రం నుంచి బస్సులో బయలుదేరి 11 గంటలకు కరీంనగర్ చేరుకొంటారు. అక్కడ లోయర్ మానేరు డ్యాం వద్ద మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మద్యాహ్నం 12 గంటలకు కలెక్టర్ కార్యాలయం చేరుకొని జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. మద్యాహ్నం 12.35 గంటలకు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. తరువాత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డి ఇంట్లో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. మళ్ళీ మద్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ చేరుకొంటారు.