ముఖేష్ అంబాని ఇంట్లో ఏమయిందో?

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో సోమవారం రాత్రి సుమారు 9 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఆల్టామౌంట్ రోడ్డులో ముఖేష్ అంబానీ ముచ్చటపడి నిర్మించుకొన్న 27   అంతస్తుల అంటిలియా భవనంలో 9వ అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంగతి తెలియగానే 6 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చాయి. ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి గత ఏడేళ్ళుగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఆ బహుళ అంతస్తుల భవనంలోనే నివాసం ఉంటున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు ఆ భవనంలోనె ఉన్నారా లేదా ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.