కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిల్లీలోని చైనా రాయబారి లూ ఝాహోయ్ తో సమావేశమయినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించడం సంచలనం సృష్టించింది. నాలుగైదు రోజుల క్రితమే ఆయన చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా మెతకగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు కూడా వంత పాడారు. నేటికీ సిక్కింలో భారత్-చైనాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి సమయంలో రాహుల్ గాంధీ చైనా రాయబారిని ఎందుకు కలిసినట్లు? ఏమి మాట్లాడినట్లు? అని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే గమ్మతైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ కార్యాలయ అధికారులు కూడా ఈ వార్తను గట్టిగా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నడూ చైనా రాయబారిని కలువలేదని, ఆయనకు ఆ అవసరమే లేదని గట్టిగా వాదిస్తున్నారు. మరి అయితే చైనా రాయబార కార్యాలయం అబద్దం చెపుతోందా లేక కాంగ్రెస్ పార్టీ అబద్దం చెపుతోందా? చెపితే ఎందుకు? అనే విషయాలు తేలవలసి ఉంది.