అహ్మదాబాద్ కు యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. సుమారు 600 ఏళ్ళ చరిత్ర కలిగిన అతిపురాతనమైన అహ్మదాబాద్ నగరాన్ని వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించింది. దీంతో దేశంలోనే ఆ ఘనత దక్కించుకొన్న మొట్టమొదటి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. అంతేకాదు.. వారసత్వ నగరాలుగా గుర్తింపు పొందిన పారిస్, రోమ్, కైరో, వియన్నా, బ్రసెల్స్ వంటి పురాతన నగరాల సరసన గర్వంగా నిలిచింది. శనివారం రాత్రి యునెస్కో ఈ విషయాన్నీ ప్రకటించింది. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఆనందం వ్యక్తం చేశారు.