అమర్ నాథ్ యాత్రలో ఇద్దరు తెలుగువారు మృతి

అమర్ నాథ్ యాత్రలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. ఈ యాత్రలో భాగంగా జమ్మూ నుండి శ్రీనగర్ కు 44 మంది ప్రయాణికులను తీసుకువెళుతున్నప్పుడు బస్సులో గ్యాస్ సిలిండర్ ప్రేలడంతో దానిలో ప్రయాణిస్తున్న ఇద్దరు తెలుగువారు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ క్వజీ గుండ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని అనంతనాగ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిలో ఒకరు కామారెడ్డి జిల్లాకు చెందినవారు కాగా మరొకరు ఆంధ్రాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరు వ్యక్తులు కామారెడ్డి జిల్లాకు చెందినవారున్నారు. ఈ ప్రమాదం గురువారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గాం జిల్లాలో క్వాజీ గుండ్ ప్రాంతంలో జరిగింది.