సి.ఈ.సి.గా అచల్ కుమార్ జ్యోతి

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ నసీం జైదీ పదవీ కాలం నేటితో ముగియడంతో అయన స్థానంలో గుజరాత్ కు చెందిన అచల్ కుమార్ జ్యోతి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 1975 ఐ.ఎస్.ఎస్.బ్యాచ్ కు చెందిన ఆయన ఇంతకు ముందు గుజరాత్ ప్రభుత్వంలో పరిశ్రమలు, రెవెన్యూ, నీటి సరఫరా శాఖలలో ప్రధాన కార్యదర్శిగా చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా చేశారు. 2015, మే 8 నుంచి ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్ ముగ్గురు సభ్యులలో ఒకరిగా చేస్తున్నారు. ఆయన 2017, జూలై 6 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.