3వ విడత హరితహారం ప్రారంభించనున్న కేసీఆర్

ఈసారి 3వ విడత హరితహారం పధకం ఈనెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పట్టణంలో ప్రారంభిస్తారు. హరితహారం పధకం క్రింద మొక్కలు నాటడమే కాకుండా వాటిని ఏడాది పొడవున కాపాడేందుకు స్థానిక ప్రజలు, విద్యార్ధులతో కూడిన గ్రీన్ బ్రిగేడ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు సూచించారు. పట్టణంలో ఉన్న 50 డివిజన్లకు 50 గ్రీన్ బ్రిగేడ్స్ ను, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని పట్టణాలకు డివిజన్లవారిగా గ్రీన్ బ్రిగేడ్స్ ను ఏర్పాటు చేయాలని, ఏడాది పొడవునా ఆ మొక్కలను సంరక్షించే బాధ్యత వారికి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.