తెలంగాణాలో కొత్తగా 3 నగరాభివృద్ధి సంస్థలు ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ముందు వరుసలో ఉన్నాయి. కనుక ఆ మూడు జిల్లాలలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కొత్తగా మూడు నగరాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయడానికి ఫైల్ పై సంతకం చేశారు. త్వరలోనే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వాటిని ప్రారంభిస్తారు.