మోడీ టీ అమ్మిన దుఖాణం ఇదే!

ఇప్పుడు యావత్ దేశాన్ని శాసిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు తన తండ్రితో కలిసి టీ అమ్ముకొని జీవనం సాగించేవారని అందరికీ తెలిసిందే కానీ ఆ ప్రాంతాన్ని, ఆ దుఖాణాన్ని ఎవరూ ఇంతవరకు చూడలేదు. వడ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం మీద ఆ టీస్టాల్ నేటికీ అలాగే ఉంది. దానిని పర్యాటక ఆకర్షకేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే ఆ టీ దుఖాణాన్ని యధాతధంగా ఉంచి వడ్ నగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించడం ద్వారా దాని ప్రాముఖ్యత అందరూ గుర్తించేలా చేయాలని భావిస్తోంది. మోడీ ఒకప్పుడు టీ అమ్ముకొన్న టీ స్టాల్ ఇదే!