ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీరా కుమార్ ఈరోజు హైదరాబాద్ పర్యటన ముగించుకొని భువనేశ్వర్ వెళ్ళవలసి ఉంది కానీ ఫ్లైట్ మిస్ అవడంతో తరువాత ఫ్లైట్ కోసం శంషాబాద్ విమానాశ్రయంలో రాత్రి 8 గంటల వరకు ఎదురుచూస్తూ కూర్చోవలసి వచ్చింది. ఆమె హైదరాబాద్ లో తన కార్యక్రమాలు సకాలంలోనే ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయం చేరుకొన్నప్పటికీ, అక్కడ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ కూర్చోండిపోవడంతో ఆమె ఎక్కవలసిన విమానం వెళ్ళిపోయింది. ఆమె వచ్చే వరకు విమానం నిలిపి ఉంచుతారని కాంగ్రెస్ నేతలు భావించారేమో? ఏమైనప్పటికీ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఆమెకు ఇటువంటి అనుభవం ఎదురవడం విచిత్రంగానే ఉంది. ఆమెను తెరాస నేతలు, ప్రభుత్వం పట్టించుకొనప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా ఘనంగా స్వాగతం, వీడ్కోలు పలికారు.