అటార్నీ జనరల్ గా కెకె బాధ్యతలు స్వీకారం

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కెకె వేణుగోపాల్ భారతదేశ 15వ అటార్నీ జనరల్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదివరకు మురార్జీ దేశాయ్ హయంలో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. భారత ప్రభుత్వం 2015లో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆయన భారత్ కే కాకుండా భూటాన్ దేశానికి కూడా విశేష సేవలు అందించారు. ఆ దేశ రాజ్యాంగం రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆయన భూటాన్ ప్రభుత్వానికి రాజ్యాంగ సలహాదారుగా కూడా పనిచేశారు. న్యాయవ్యవస్థలో సుదీర్ఘ అనుభవం, విశేష ప్రతిభాపాటవాలు కలిగిన ఆయనకు ఇప్పుడు చాలా సముచితమైన స్థానమే దక్కిందని చెప్పవచ్చు.