ప్రధాన ఎన్నికల కమీషనర్ గా జ్యోతి?

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేస్తున్న నసీం జైది పదవీకాలం ఈనెల 6తో ముగియబోతోంది. ఆయన స్థానంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన ఆచల్ కుమార్ జ్యోతి (64) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల కమీషన్ ముగ్గురు సభ్యులలో ఒకరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత కాండ్లా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా, సర్దార్ మానస్ సరోవర్ నిగం లిమిటెడ్ ఎండిగా, గుజరాత్ రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ గా పనిచేశారు. 

భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వ్యక్తిగత కారణాలతో తన పదవిలో నుంచి తప్పుకోవాలని భావిస్తుండటంతో ఆయన స్థానంలో సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ ను నియమించబోతున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం త్వరలోనే ఆయన నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.