తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత సుమారు రెండేళ్ళపాటు తరచూ ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉండేవి. ఆ కారణంగా రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికల వాతావరణం కనబడుతుండేది. మళ్ళీ చాలా కాలం తరువాత తెలంగాణాలో ఎన్నికల గంట మ్రోగింది. రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలలో ఖాళీగా ఉన్న పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికలు జరుగబోయే వాటిలో గ్రామపంచాయితీ సర్పంచ్-16, గ్రామ పంచాయితీ వార్డులు-133, నగర పంచాయితీ వార్డు-1, ఎంపిటిసిలు-4 ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది.
నోటిఫికేషన్ జారీ మరియు నామినేషన్ల స్వీకరణ: జూలై 1,
ఎంపిటిసికి పోలింగ్ తేదీ: జూలై 13, కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన : జూలై 15,
నగర పంచాయతీ వార్డుకు పోలింగ్: జూలై 14, కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: జూలై 17,
ఇతర స్థానాలకు పోలింగ్, ఓట్లు కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: జూలై 13