అక్బరుద్దీన్ ఓవైసి కేసులో దోషుల నిర్ధారణ

మజ్లీస్ పార్టీ చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై 2011 ఏప్రిల్‌ 30న బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో జరిగిన హత్యాప్రయత్నంలో నిందితులుగా గుర్తించబడిన 14 మందిలో నలుగురు మాత్రమే దోషులుగా మిగిలిన వారిని నిర్దోషులుగా నాంపల్లి కోర్టు ప్రకటించింది. వారిలో హసన్ (ఎ-2), అబ్దుల్లా (ఎ-3), వాహిద్ (ఎ-5), వహ్లాన్ (ఎ-12) లను దోషులుగా ఈరోజు కోర్టు ప్రకటించింది. వారిలో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన పహిల్వాన్ కూడా నిర్దోషిగా బయటపడటం విశేషం. నలుగురు దోషులకు పదేళ్ళ జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.10,000 జరిమానాలు విధించింది. 

ఓవైసిపై జరిగిన హత్యాప్రయత్నంలో అయన తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాలతో తప్పించుకోగలిగారు కానీ అయన గన్ మెన్ ఇబ్రహీం బిన్ యూనుస్ మృతి చెందాడు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసులో 86 మంది సాక్షులని విచారించిన తరువాత ఈ తుది తీర్పు వెలువరించింది.