సంబంధిత వార్తలు
ఉపరాష్ట్రపతి మొహమ్మద్ హమీద్ అన్సారి పదవీకాలం ఈ ఏడాది ఆగస్ట్ 10వ తేదీతో ముగుస్తుంది. కనుక ఆ పదవికి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ నసీం జైదీ గురువారం షెడ్యూల్ ప్రకటించారు. జూలై 4న నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అదే రోజు నుంచి జూలై 18 వరకు నామినేషన్లు స్వీకరించబడుతాయి. ఆగస్ట్ 5వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రెటరీ జనరల్ వ్యవహరిస్తారని జైదీ తెలిపారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయసభల సభ్యులు కలిసి ఎన్నుకొంటారు. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభలలో కలిపి మొత్తం 790 మంది సభ్యులున్నారు.