సంబంధిత వార్తలు
హైదరాబాద్ లో కేవలం రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తున్న జి.హెచ్.ఎం.సి ఇప్పుడు మరో గొప్ప కార్యక్రమానికి సంసిద్ధం అవుతోంది. నగరప్రజలకు కేవలం ఒక్క రూపాయికే శుద్ధిచేసిన మంచినీళ్ళు అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ మొదటివారం నుంచి నగరంలో 15 ప్రధాన ప్రాంతాలలో వాటిని ప్రారంభించడానికి టెండర్లు పిలిచింది. వాటిని నిర్వహించేందుకు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, వారికి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో దుఖాణం ఉచితంగా నిర్మించి ఇస్తామని జి.హెచ్.ఎం.సి. చెపుతోంది. ఈ కాంట్రాక్ట్ తీసుకొన్నవారు ఏడేళ్ళపాటు శుద్దమైన నీటిని అందిస్తామని హామీ పత్రం ఈయవలసి ఉంటుంది.