ఆ విషయంలో నో కన్ఫ్యూజన్: బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం తెదేపా శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. నటిస్తున్న సినిమాలు వరుసగా విజయం సాధిస్తుండటంతో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తో చేస్తున్న పైసా వసూల్ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ ఆ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా షూటింగుల కోసం ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది కనుక ఆయన తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. సినీ కెరీర్ మళ్ళీ ఊపందుకొంది కనుక ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించాలనుకొంటున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి.

ఆదివారం హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ ఆవార్తలను ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ ఏనాడూ ణా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయలేదు. దాని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. హిందూపురంతో మా కుటుంబానికి ఉన్న అనుబందం ప్రత్యేకమైనది. నేను రాజకీయాలలోనే ఉంటాను. వచ్చేఎన్నికలలో కూడా హిందూపురం నుంచే పోటీ చేస్తానుఈ విషయంలో నో కన్ఫ్యూజ్, అని అన్నారు. ఈ సందర్భంగా ఇంతవరకు ఆయన హిందూపురంలో చేసిన, ఇక ముందు చేయబోతున్న అభివృద్ధి పనుల గురించి మీడియాకు వివరించారు. అలాగే స్థానిక తెదేపా నేతలతో భేదాభిప్రాయాలున్నాయనే వార్తలను కూడా అయన ఖండించారు.