బోరుబావిలోనే చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా జిల్లా ఎక్కారెడ్డిగూడలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిపోయిన చిన్నారి పాపను సజీవంగా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సుమారు 300-400 అడుగుల లోతుకు జారిపోయిన పాప అక్కడ ఉన్న బురద నీళ్ళలో కూరుకుపోవడంతో కనీసం పాప శవాన్ని కూడా బయటకు తీయలేకపోయారు. చివరికి ఎయిర్ ఫ్లాషింగ్ పద్దతిలో తీసేందుకు ప్రయత్నిస్తే పాప ధరించిన గౌను, ఆమె శరీర అవశేషాలు మాత్రమే బయటకు వచ్చాయి. వాటినే ఒక తెల్లదుప్పటిలో చుట్టి పోస్ట్ మార్టం తరువాత పాప తల్లితండ్రులకు అప్పగించారు. అది చూసి ఆ చిన్నారి తల్లి తండ్రులే కాదు..ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల ఉద్యోగులు, ఆ గ్రామ ప్రజలు అందరూ చాలా బాధపడ్డారు. ఈరోజు ఉదయం ఆ పాప అంత్యక్రియలు పూర్తిచేశారు.