ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ కారు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ ప్రాంతంలో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా డ్డీ కొనడంతో అతను మృతి చెందాడు. ఆ సమయంలో అతను సుమారు 150 కిమీ వేగంగా కారు నడుపుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయ్యింది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ కోసం కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ వెంటనే తెరుచుకొన్నప్పటికీ ఆ ధాటికి అవి కూడా పగిలిపోవడంతో భరత్ ప్రమాదస్థలంలోనే మరణించాడు. కారులో నుంచి పోలీసులు ఒక మద్యం సీసాను స్వాధీనం చేసుకొన్నారు. అది సగం ఖాళీ అయ్యుంది. కనుక అతను మద్యం మత్తులో కారు నడుపుతున్నాడా? అనే విషయం పోస్ట్ మార్టంలో తెలియవలసి ఉంది. ఈరోజు ఉదయం అతని శవానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగింది. రవితేజ, అతని స్నేహితులకు పోలీసులు శవాన్ని అప్పగించారు.