ఇంతవరకు కేవలం ఇంగ్లీషులోనే ముద్రింపబడుతున్న భారత్ పాస్ పోర్ట్ ఇకపై హిందీ, ఇంగ్లీషు రెండు బాషలలో ముద్రించబడతాయి. భారత్ లో పాస్ పోర్ట్ చట్టం అమలులోకి వచ్చి 50 సం.లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈవిషయాన్ని ప్రకటించారు. జర్మనీ, రష్యా, గల్ఫ్ దేశాలు తమ తమ బాషలలోనే పాస్ పోర్ట్ లను ముద్రించుకొంటున్నప్పుడు మనం మాత్రం ఎందుకు హిందీలో ముద్రించుకోకూడదు అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. రెండు బాషలలో పాస్ పోర్ట్ లను ముద్రించడానికి నాసిక్ లోనే పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రెస్ కు ఆదేశాలు జారీ చేశామని ఆమె తెలిపారు. ఎనిమిది సంవత్సారాల లోపు, 60 సం.ల పైబడి ఉన్నావారికి పాస్ పోర్ట్ ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే దేశంలో మొత్తం 235 పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాలను ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. మొదటి దశలో 86 కేంద్రాలను,రెండవ దశలో మరో 149 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వీటి ఏర్పాటు చేయడానికి దేశవ్యాప్తంగా 52 హెడ్ పోస్ట్ ఆఫీసులను గుర్తించామని త్వరలోనే అవి పనిచేయడం మొదలుపెడతాయని ఆమె తెలిపారు.