మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు పధకం చేపట్టారు. ఆ విధంగా ఇంతవరకు 60 నగరాలను ఎంపిక చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం మరో 30 నగరాల పేర్లను ప్రకటించారు. వాటిలో తెలంగాణా రాష్ట్రం నుంచి కరీంనగర్ ను ఎంపిక చేశారు. ఆంధ్రా నుంచి అమరావతిని ఎంపిక చేశారు. ఇంతకు ముందు విడుదల చేసిన జాబితాలలో హైదరాబాద్, వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఈరోజు ప్రకటించిన వాటితో కలిపి ఇంతవరకు మొత్తం 90 నగరాలు స్మార్ట్ సిటీల జాబితాలో చేరాయి.
ఈరోజు ప్రకటించిన జాబితాలో ఉన్న నగరాల పేర్లు ఇవే: కరీంనగర్, అమరావతి, తిరువనంతపురం, తిరుప్పూర్, తూతుకుడి, తిరుచురాపల్లి, తిరునెల్వేలి, పుదుచ్చేరీ, బెంగళూరు, నయా రాయ్‌పూర్, బిలాస్‌పూర్, కర్నల్, సత్నా, అలహాబాద్, అలిగఢ్, సాగర్, ఝాన్సీ, ముజఫర్‌నగర్, రాజ్‌కోట్, డెహ్రాడూన్, గాంధీనగర్, జమ్ము , శ్రీనగర్, సిమ్లా, పాట్నా, దాహోద్, పింప్రీ చించ్వద్, పాశిఘాట్, ఐజల్, గ్యాంగ్‌టక్.