కేసీఆర్ నేడు సిద్ధిపేట పర్యటన

నేడు సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో జరుగబోయే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఆయన పర్యటన వివరాలు: 

ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రగతి భవన్ నుంచి సిద్ధిపేటకు బస్సులో బయలుదేరుతారు. 11.30 గంటలకు కొండపాకలో ఈ కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడ లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. మద్యాహ్నం 11.45 గంటలకు డోలు వాయించి ఈ పధకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. మద్యాహ్నం ఒంటి గంటకు కొండపాకలోనె భోజనం చేసి 1.30కు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. మద్యాహ్నం 2.30గంటలకు తిరిగి ప్రగతి భవన్ చేరుకొంటారు.