మందుల తయారీలో దేశంలో అగ్రస్థానాలలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటి. ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా వైద్య పరికరాలను తయారుచేసే సంస్థల పార్క్ (పారిశ్రామికవాడ) ఏర్పాటు చేయబోతోంది. మెదక్ జిల్లా పటాన్ చేరు మండలంలో సుల్తాన్ పూర్ లో ఈ మెడికల్ పార్క్ ఏర్పాటుకాబోతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ శనివారం ఈ పార్క్ ప్రారంభోత్సవం చేస్తారు.
250 ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మెడికల్ పార్క్ లో మొదటి దశలో రూ. 271 కోట్లు పెట్టుబడి పెట్టి వైద్య పరికరాల పరిశ్రమలను స్థాపించడానికి 13 సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్, సందూర్ మెడికెయిడ్స్, పల్స్ యాక్టివ్ స్టేషన్స్, సదుగురు హెల్త్ కేర్ మొదలైన సంస్థలున్నాయి. వాటన్నిటికీ ఈరోజే భూమి పత్రాలు అందజేయబోతున్నట్లు టి.ఎస్.ఐ.ఐ.సి. చైర్మన్ బాలమల్లు చెప్పారు. రెండవ దశలో మరో 221 ఎకరాలలో మెడికల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మొదటి దశ పార్క్ లో ఉత్పత్తి మొదలైతే వాటిలో ప్రత్యక్షంగా 3,000 మందికి పరోగా మరో 10,000 మందికి ఉద్యోగుపాది అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇదిగాక ముచ్చర్లలో 16,000 ఎకరాలలో కొత్తగా ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు బాలమల్లు చెప్పారు.