త్వరలో పార్లమెంటు సమావేశాలు

జూలై 12వ తేదీ నుంచి ఆగస్ట్ 11వరకు పార్లమెంటు వర్షాకాలసమావేశాలు నిర్వహించబోతున్నట్లు  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ సమావేశాలకు ముందే అంటే జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తం నూతన పన్ను విధానం జి.ఎస్.టి. అమలులోకి వస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అంటే జూలై 17వ తేదీన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు 20న ప్రకటిస్తారు. ఇక పార్లమెంటు అనుమతి లేకుండానే కేంద్రప్రభుత్వం గోవధను నిషేదిస్తూ తెచ్చిన చట్టం, దాని పర్యవసానాలపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు, వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆవులను తరలిస్తున్న వారిపై గో సంరక్షక్ పేరిట దేశావ్యాప్తంగా జరుగుతున్న దాడులపై కూడా ఈ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొన్ని బిల్లులపై ఎలాగూ వాటి మధ్య యుద్ధం తప్పదు.