ట్యాంక్ బండ్ పై సినారె విగ్రహం

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సి.నారాయణ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన భౌతికకాయాన్ని సందర్శించుకొని  నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్ పై సినారె విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరొకటి సిరిసిల్లా జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో సినారె పేరిట ఒక స్మారక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినారె అచ్చమైన తెలంగాణా కవి, రచయిత అయినప్పటికీ యావత్ తెలుగుజాతికి ఆత్మీయుడిగా అందరి హృదయాలలో గౌరవం సంపాదించుకొన్నారని కేసీఆర్ అన్నారు.