పాల్వాయి ఆకస్మిక మృతి

తెలంగాణాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. సీమ్లాలోని  కులుమనాలిలో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఈరోజు ఉదయం హోటల్ నుంచి కారులో వెళుతుండగా తీవ్రంగా గుండెపోటు రావడంతో కారులోనే మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సీమ్లా నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.