తెలంగాణాకు మరో జాతీయ అవార్డు

తెరాస సర్కార్ పాలనలో రాష్ట్రం తిరోగమనదిశలో పయనిస్తోందని భాజపాతో సహా ప్రతిపక్షాలన్నీ ఒకపక్క తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే తెలంగాణా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం నిత్యం ఏదో ఒక అవార్డు ప్రకటిస్తుండటం విశేషం. వాటి విమర్శలకు తెరాస సర్కార్ జవాబు చెప్పనవసరం లేదు.. ఆ అవార్డులే చెంప దెబ్బ కొట్టినట్లుగా జవాబు చెబుతున్నాయి.     

తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో బారీ ఎత్తున ఉపాదిపనులు చేపట్టడం ద్వారా పేదరిక నిర్మూలన చేస్తున్నందుకు తెలంగాణా ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది. కేంద్ర గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ప్రకటించిన ఈ అవార్డును డిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో నిన్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమార్ చేతుల మీదుగా రాష్ట్ర సెర్ఫ్ డైరెక్టర్ బాలయ్య అందుకొన్నారు.