మధ్యప్రదేశ్ లో దారుణం

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఈరోజు ఉదయం మంద్సౌర్ అనే పట్టణంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటరుణాల మాఫీ చేయాలని కోరుతూ వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు ఈరోజు తమ ఆందోళన తీవ్రతరం చేశారు.స్థానిక పీపల్య మండి (వ్యవసాయ మార్కెట్) పరిసర ప్రాంతాలలో కర్ఫ్యూ విదించినప్పటికీ రైతులు తమ ఆందోళన కొనసాగించడంతో వారికీ, పోలీసులకు మద్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులను అదుపు చేసేందుకు కాల్పులు జరూపగా ఐదుగురు రైతులు మృతి చెందారు.

దీంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. రైతులు తీవ్ర ఆగ్రహంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టి పోలీసులను చితకబాదారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అదనపు భద్రతాదళాలను రప్పించవలసి వచ్చింది. రైతులపై పోలీసులు కాల్పులు జరిఫై పొట్టన పెట్టుకొన్నందుకు నిరసనగా రైతు సంఘాలు బుధవారం మద్యప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.   

కాంగ్రెస్ పార్టీయే వెనుక నుండి  రైతులను రెచ్చగొడుతోందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
“మన దేశంలో ఈ ప్రభుత్వం రైతులతో యుద్ధం చేస్తోంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.