తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు కానుకగా 2437 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టి.ఎస్.పి.ఎస్.సి.) చైర్మన్ ఘంటా చక్రపాణి నిన్న ఒకేసారి వరుసగా 15 నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆ వివరాలు:
విద్యాశాఖ:
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులు: 546, జూనియర్ లెక్చరర్లు: 152, ప్రిన్సిపాల్ మరియు లైబ్రేరియన్ పోస్టులు: 304.
పశుసంవర్ధక శాఖ: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు: 541 పోస్టులు
ఐ అండ్ క్యాడ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ, భూగర్భ జలవనరుల శాఖ: అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు: 463 పోస్టులు. డిప్యూటీ సర్వేయర్స్: 273పోస్టులు (సర్వే సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో)
వీటిలో ఇన్ స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఫారెస్ట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మొదలైన పోస్టులు కూడా ఉన్నాయని టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. వీటిలో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్ మరియు లైబ్రేరియన్ పోస్టులకు వ్రాతపరీక్షలు ఉండవని ఇంటర్వ్యూల ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు.
ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 6వ తేదీ నుంచి 24వరకు గడువు ఉంటుంది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్ సైట్ లో లభిస్తాయి.
గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ఈనెల 29,30 తేదీలలో మెయిన్ పరీక్షలు నిర్వహించబడతాయి. జూలై 4,5, 6 తేదీలలో టిజిటి, జూలై,12,13, తేదీలలో పిజిటి లాంగ్వేజి, జూలై 14, 15 తేదీలలో టిజిటి, లాంగ్వేజి, పరీక్షలు నిర్వహించబడతాయి. జూలై 30న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రత్యేక టీచర్ల భర్తీకి వ్రాత పరీక్షలు టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు.