కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకొన్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి, హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ వారితో కలిసి ఊరేగింపుగా సోమాజీగూడ చేరుకొని అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, సంగారెడ్డికి బయలుదేరారు. మరికొద్ది సేపటిలో స్థానిక అంబేద్కర్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాగర్జన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం ఈ రోజు రాత్రి 9.30 గంటలకు డిల్లీ తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ జూన్ 4వ తేదీన గుంటూరులో జరుగబోయే కాంగ్రెస్ సభకు వస్తారు.