సంబంధిత వార్తలు
ఈరోజు ఉదయం అసోంలోని తేజ్ పూర్ నుంచి బయలుదేరిన భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ద విమానం గల్లంతయింది. దానిలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారు రోజువారి శిక్షణ కార్యక్రమంలో భాగంగానే దానిలో బయలుదేరారు కానీ కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయం తెలియగానే వాయుసేన అధికారులు విమానాలు, హెలికాఫ్టర్లలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇంకా దాని ఆచూకి దొరకలేదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి కనుక బహుశః అది యాంత్రిక లోపం ఏర్పడి ఎక్కడైనా కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.