సంబంధిత వార్తలు
కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పని చేస్తున్న అనిల్ మాధవ్ దవే నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న హర్ష వర్ధన్ కు పర్యావరణ శాఖ భాద్యత కూడా ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించడంతో ఆయన మంగళవారం భాద్యతలు స్వీకరించారు. దివంగత అనిల్ మాధవ్ దవే అంతిమ కోరిక ప్రకారం పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హర్ష వర్ధన్ తమ కార్యాలయ ఆవరణలో ఆయన జ్ఞాపకార్ధం ఒక మొక్కను నాటారు.