
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత రెండేళ్ళుగా తెరాస ఎంపిలు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి అభ్యర్ధనపై కేంద్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. అయితే కేవలం పసుపు ఒక్కదానికే ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, రెండు మూడు రకాల మసాల దినుసులు లేదా సుగంధ ద్రవ్యాలతో కూడిన స్పైసస్ బోర్డు ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని తెరాస ఎంపిలకు తెలిపారు. దానిలో రాష్ట్రంలో మరియు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పండించే మసాల, సుగంధ ద్రవ్యాలను (ముడి సరుకును) ప్రాసెసింగ్ చేసినట్లయితే వాటి మార్కెట్ విలువ పెరుగుతుందాని దాని వలన రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆమె సూచించారు. గుంటూరు మరియు కర్నాటక తరహాలో ఈ బోర్డును ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవలసి ఉంది.